తెలుగు రాష్ట్రాల పరిధిని దాటి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం తారక్ ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళినా అతడిని గుర్తు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటలో చరణ్ తో కలిసి అతడు వేసిన నాటు స్టెప్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సెలెబ్రెటీలు అభిమానులుగా మారిపోయారు.



లేటెస్ట్ గా ఫిఫా లాంటి అతి పెద్ద క్రీడా సంస్థ ఎన్టీఆర్‌ రెఫరెన్సుతో పోస్టు పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్స్ నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డోలకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు వారు ముగ్గురు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ముగ్గురు కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా  నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నట్లుగా క్యారికేచర్ వేయించడమే కాకుండా ఆ ముగ్గురి పేర్లలో మొదటి ఇంగ్లిష్ అక్షరం తీసుకుని ‘NTR’ అనే కామెంట్ కూడా పెట్టడంతో ఇప్పుడు ఆఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



ఈఫోటో జూనియర్ ఎన్టీఆర్ దృష్టి వరకు రావడంతో ఆ ఫోటో పై తారక్ కూడ స్పందించాడు. ఈ పోస్టు పై తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ జూనియర్ నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డో లకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘దేవర జూనియర్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఘన విజయం సాధించలేకపోవడంతో అభిమానులు తమ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న మూవీ విడుదల గురించి చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.



పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ భారీ యాక్షన్ మూవీలో హృతిక్ పక్కన తారక్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీ చేస్తూనే తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోయే యాక్షన్ మూవీకి రెడీ అవుతున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: