దీనితో ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అన్న సందేహాలు ప్రభాస్ అభిమానులలో ఉన్నాయి. అయితే ఈసినిమా నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ ఆలోచనలలో ఈసినిమా విడుదలకు అనేక డేట్స్ పరిశీలన చేస్తున్నప్పటికీ వారు ఆలోచిస్తున్న ప్రతి డేట్ కు ఏదో ఒక సమస్య ఎదురౌతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు ఈ నిర్మాణ సంస్థ ఈమూవీ రిలీజ్ కోసం పోటీలేని రిలీజ్ డేట్ అయితే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈ మూవీని ఈ సంవత్సరం దసరా రేస్ లో దింపాలాని భావిస్తున్నప్పటికీ దసరా ను టార్గెట్ చేస్తూ ఒక వారం రోజులు ముందుగా బాలకృష్ణ బోయపాటి ల ‘అఖండ 2’ విడుదల అవుతుంది అన్న సంకేతాలు వస్తున్న నేపధ్యంలో దసరా రేస్ లో ప్రభాస్ ‘రాజాసాబ్’ ఉండకపోవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.
‘అఖండ 2’ పోటీని పట్టించుకోకుండా అక్టోబర్ 2న విడుదల చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పటికీ అదే డేట్ కు ‘కాంతార చాప్టర్ 1’ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోను ‘రాజా సాబ్’ దసరా విడుదలకు అవకాశాలు లేనట్లే అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈసినిమాను ఆగస్ట్ లో ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ నెలలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టారర్ తో ‘రాజా సాబ్’ ను విడుదల చేయడం మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు టాక్. ఈ ఆలోచనలు ఇలా జరుగుతూండగానే దర్శకుడు మారుతి మాత్రం ఈ ఆలోచనలు పక్కకు పెట్టి ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది..