టాలీవుడ్ లో వ‌రస పాన్ ఇండియా సినిమాలు రావడం ప్రేక్షకులు వాటికి తగ్గట్టుగా టాక్ ను ఇవ్వటం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం .. అయితే భారీ సినిమాల కు పైరసీ భూతం బెడద ఎప్పటి నుంచో పెద్ద సమస్య గా తయారైంది ..  రీసెంట్ గా ఈ పైరసీ భూతం టాలీవుడ్ వర్గాలకు పెద్ద తలనొప్పి గా మారిపోయింది .. రిలీజ్ రోజునే హెచ్ డి ప్రింట్ సినిమా లను ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు పైరసీ కేటుగాళ్లు . రీసెంట్ గానే గేమ్ చేంజర్ మూవీ కూడా ఈ సమస్య బారిన పడింది .. రిలీజ్ రోజునే హెచ్ డి ప్రింట్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడం ఆ సినిమాకు భారీ నష్టం కలిగించింది ..


ఇక దాంతో ఆ చిత్ర యూనిట్ దాని వెనకాల ఉన్న దుష్ట శక్తులను పట్టుకునేందుకుప్రయత్నించారు .. కాగా ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన తండేల్ మూవీ కి కూడా ఈ సమస్య వచ్చి పడింది .. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే హై క్వాలిటీ ప్రింట్ ఇంటర్నెట్లో వచ్చేసింది . ఇక దీంతో ఇప్పుడు తండేల్‌ మేకర్స్  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .. అసలు సినిమా ని ఇంత హై క్వాలిటీ ప్రింట్ తో ఎలా ఇంటర్నెట్లో లిక్‌ చేస్తున్నారా అనేది ఎవరికీ తెలియని మిలియన్ డాలర్ క్యూస్షన్ గా మిగిలిపోయింది ..


 ఇప్పటికైనా టాలీవుడ్ లో ఉన్న సినీ పెద్దలు పైరేసి భూతం పై తగిన చర్యలు తీసుకోవడం బెటర్ అని కూడా సాధారణ ప్రేక్షకులు అంటున్నారు . మరి రాబోయే రోజుల్లో కూడా పెద్ద సినిమాల కు ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాబోయే రోజుల్లో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడటం మానేస్తార ని కూడా అంటున్నారు . ఈ పైరసీ భూతం పై టాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: