- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం చిత్ర పరిశ్ర లో సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసింది .. తర్వాత ఫిబ్రవరిలో సినిమాలో సందడి కూడా మొదలయ్యింది ..ఈ నెలలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ సినిమాలలో సౌత్ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల , టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ ఈ రెండు సినిమాలు కూడా ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో తాజాగా చైతన్య అజిత్ సినిమా ని బుకింగ్స్ పరంగా క్రాస్ చేయటం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారింది .


 ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్‌ సినిమా ఒక్కరోజులోనే 2 లక్షల 20 వేలుకు పైగా టికెట్స్ బుక్ అయితే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా కి ఊహించిని విధంగా లక్షల 50 వేలకు పైగా టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి .. ఇక దీంతో ఇప్పుడు నాగచైతన్య పేరిట మరో క్రేజీ రికార్డ్ సెట్  చేసుకున్నాడు .. ఇక ఈరోజు శనివారం బుకింగ్స్ కూడా  చైతన్య సినిమా కి సాలిడ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది .. ఇప్పటికే చైతన్య కెరియర్ లో హైయెస్ట్ నెంబర్స్ ఈ సినిమా కి నమోదు అవుతున్నాయి ..  ఇక ఫైనల్ గా తండెల్ సినిమా లెక్కలు ఎక్కడి కి వెళ్లి ఆగుతాయో కూడా తెలియటం లేదు . ఇప్పటికే ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా కలెక్షను రాబట్టి 30 కోట్లకు పైగా గ్రాస్ ను తెచ్చుకుంది . నాగచైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ కూడా ఇదే .. మరి ఈ అక్కినేని హీరో 100 కోట్ల కళ ఈ సినిమా తో నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: