తెలుగు చిత్ర పరిశ్రమ లో తిరుగులేని స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు .. ఎలాంటి పాత్రలైనా తన ప్రాణం పెట్టి  నటించడం ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు .. గత సంవత్సరం దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే .  గత సంవత్సరం వచ్చిన దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర చరిత్ర తిరగరాసాడు  ఎన్టీఆర్ ..


ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో రికార్డును క్రియేట్ చేయడానికి వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా కీలకపాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు .. అలాగే త్వరలోనే దేవర 2 షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాడు .. అదే విధంగా ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ కూడా చేయబోతున్నాడు . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సోషల్ అప్పుడప్పుడు పోస్ట్ లు పెడుతూ ఉంటారు .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ఎన్టీఆర్ అసలు ఇష్టపడరు అయినప్పటికీ ఈ హీరోను ఫాలో అయ్యే వాళ్ళు సంఖ్య మిలియన్స్‌ లో ఉంటుంది.


ఇక ఎన్టీఆర్ కు ఇన్ స్టాలో 7.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు .. కానీ ఇన్ స్టాలో ఎన్టీఆర్ ఏ ఒక్కరిని ఫాలో అవటం లేదు .. ఒక ఫేస్బుక్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరో కి 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు . ఇంతమంది ఫాలో అవుతున్నా ఎన్టీఆర్ మాత్రం ఫేస్‌బుక్ లో  కేవలం రెండు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు .. అందులో ఒకటి దర్శకుడు రాజమౌళి కాగా మరొకటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ .. ట్విట్టర్ లో కూడా కేవలం రాజమౌళిని మాత్రమే ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: