![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/trivikram-427e9756-d39b-46f7-895a-d42ffd99722b-415x250.jpg)
ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఫ్యామిలీ సినిమాలే వచ్చాయి .. కానీ ఈసారి అంతకుమించి అంటున్నాడు త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కోసం మొదటిసారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు గురూజీ. ఇక ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి .. ముందు నుంచి పురాణాలపై గురూజీకి పట్టు ఎక్కువ . కుమారస్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది .. యుద్ధానికి ఆధ్యుడి గా కార్తికేయున్ని కొలుస్తారు .. ఆయన్ని స్కందా అని కూడా పిలుస్తారు .
టాలీవుడ్ కు అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా కాలం అయింది .. అందుకే ఈ తరహా కాన్సెప్ట్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు .. హారిక హాసిని క్రియేషన్స్ - గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి . వచ్చే సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది .. ప్రెసెంట్ ఈ సినిమా కోసం తన మేకోవర్ను మార్చుకుంటున్నాడు అల్లు అర్జున్ .. అని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కాయమంటున్నారు సిని విశ్లేషకులు.