ఇక చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్న సీనియర్ హీరో , హీరోయిన్ల వారసులు చిత్ర పరిశ్రమలోకి రావడం సహజమే .  తమ తల్లిదండ్రుల బాటలోనే నడుస్తూ మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు .. అలా అనే ఇప్పుడు ఓ స్టార్ సెలబ్రిటీ కిడ్‌ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో వేగంగా అడుగులు వేస్తుంది . ఇక పైన ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎవరో గుర్తుపట్టారా  ? టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరోయిన్ కూతురు .. ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకుంటున్న ఈమె ఇప్పుడే ఫ్యాషన్ రంగంలో కూడా ఇరగదీస్తుంది.


తన తల్లి బాటలోనే మెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్న ఈమె నైజీరియాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్ లో సందడి చేసింది . ఫ్యాషన్ దుస్తులు ధరించి రాంపాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది .. ఆ తర్వాత ఆ ఫోటో లను సోషల్ మీడియా వేదిక గా షేర్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి .. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు  కూడా క్రేజీ కామెంట్లు చేస్తున్నారు .. టాలీవుడ్ కు మరో క్రేజీ హీరోయిన్ దొరికిందని కూడా అంటున్నారు .


ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్నది మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ , పొలిటీషియన్ రోజా కూతురు అన్షు మాలిక్ .. రైటర్గారైటర్ గా , వెబ్ డెవలపర్ గా , కంటెంట్ క్రియేటర్ గా మంచి పేరు తెచ్చుకుంది ఈ స్టార్ నటిి కూతురు . ఇక ఇప్పుడు ఏకంగా ఫ్యాషన్ షోలో తలుక్కున మెరిసింది అందరి ముందు ఏమాత్రం ఎలాంటి భయం లేకుండా రాంపాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది . ఇక మరి రాబోయే రోజుల్లో తన తల్లి లాగే చిత్ర పరిశ్రమలో  అడుగుపెట్టి తల్లిని మించిన కూతురుగా అనిపించుకుంటుందో లేదో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: