పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేశాడు. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలా పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలలో ఏ మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఏ హీరోలకు పవన్ వదిలేసిన సినిమాల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఒకనొక ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ కు ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి , పోకిరి సినిమా కథలను వినిపించాను. ఆయన మొదట ఆ కథలను విన్నప్పుడు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు అని అన్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేయడంతో ఇడియట్ , అమ్మానాన్న తమిళమ్మాయి సినిమాలను పూరి జగన్నాథ్ రవితేజ హీరోగా రూపొందించాడు. ఈ రెండు మూవీ లు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.

ఈ రెండు సినిమాల ద్వారా రవితేజ కు అద్భుతమైన విజయాలు , సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన పోకిరి మూవీ కథను పూరి జగన్నాథ్ , మహేష్ బాబు హీరో గా తెరకెక్కించాడు. ఈ మూవీ అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే పవన్ రిజెక్ట్ చేసిన ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి , పోకిరి సినిమాల ద్వారా రవితేజ , మహేష్ బాబు లకు అద్భుతమైన విజయాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: