టాలీవు డ్ ఇండ స్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో నితిన్ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభం నుండే మంచి విజయాలను అందు కుంటూ తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సం పాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయనకు వరుసగా అపజ యాలు వచ్చాయి. అలాంటి సమయం లో ఈ య న ఇష్క్ అనే మూవీ తో మళ్లీ విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చా డు . ఇక అప్ప టి నుండి ఈయన కెరియర్ ను పర్వా లేదు అనే దశ లో కొనసాగి స్తూ వస్తున్నాడు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మళ్లీ నితిన్ కు వరుసగా అపజయాలు వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ , వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు మూవీ లు కూడా మరి కొంత కాలం లోనే విడుదల కాబోతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం వరుస అపజయాలు వస్తున్న కూడా నితిన్ అదిరిపోయే రేంజ్ పారితోషకాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుసగా అపజయాలు వస్తున్నా కూడా నితిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని , ఆయన అదిరిపోయే రేంజ్ లో పారితోషకం ఒక్కో మూవీ కి అందుకుంటున్నాడు అని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: