![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/these-are-the-crazy-heroes-who-entered-as-character-artists-and-became-star-heroes0cd91e13-b5a8-4703-9561-96d5a266e12f-415x250.jpg)
ఇంతకీ ఆ సెలబ్రిటీలు ఎవరు.. ఆ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సిద్దు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో చాలామందికి ఈ పేరు చెప్పగానే డిజె టిల్లు సినిమానే గుర్తుకు వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పాన్ ఇండియా సినిమాల్లో సిద్దు జొన్నలగడ్డ నటించినప్పటికీ.. డీజె టిల్లుతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఒకసారిగా రూ.100 కోట్లకు పైకి కలెక్షన్ కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. ఇదే జోష్లో ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా రూ.500 కోట్ల గ్రాస్ వసుళ్ళను కల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. ఇదే విధంగా మరో స్టార్ హీరో.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు.
పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవకాశాన్ని అందుకున్న విజయ్.. మొదటి సినిమాతోనే క్లాసికల్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రౌడీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన అదే మేనరిజాన్ని కంటిన్యూ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. జూనియర్ ఆర్టిసి గా కెరీర్ ప్రారంభించిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్నాడు .. ఈ హీరో మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే పరిస్థితి నెలకొంది. కాస్త ఆలస్యంగా సినిమాలో నటిస్తున్నప్పటికీ తీసిన ప్రతి సినిమాతోనూ సక్సెస్ అందుకుంటూ క్రేజీ హీరోగా మారాడు నవీన్ పాలిశెట్టి. ఈ ముగ్గురు యంగ్ హీరోస్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటూ సైడ్ క్యారెక్టర్ లో నటించారు.