టాలీవుడ్ లో దాదాపు 40 సంవత్సరాల గా స్టార్ హీరోగా రాణిస్తూ.. మెగాస్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరంజీవి . ప్రస్తుతం విశ్వంభ‌ర‌ సినిమా షూట్ లో బిజీ గా గ‌డుపుతున్నాడు . ఇక ఈ సినిమా తో తనని తాను మరోసారి కొత్త‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నాల‌లో ఉన్నాడు చిరు . 40 సంవత్సరాల నుంచి కమర్షియల్ సినిమాలను చేస్తూ ఎవరు ట‌చ్ చేయ‌లేని క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ పొజిషన్ లో రాణిస్తున్నాడు . ఇప్పటికీ వ‌రుస సినిమాలు చేస్తు యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు .


ఈ నేప‌ధ్యంలో ప్రస్తుత ఈ జ‌న‌రేష‌న్‌ దర్శకులలో చిరంజీవికి ఇద్ద‌రు దర్శకులంటే చాలా ఇష్టమంటూ ప‌లు వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి . ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది డైరెక్టర్స్‌తో ప‌ని చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న చిరు .. త‌న‌కు మాత్రం ఈ జనరేషన్ లో ఉన్న ఆ డైరుక్ట‌ర్స్ అంద‌రిలో రాజమౌళి అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు . ఎందుకంత స్పెష‌ల్ అంటే జ‌క్క‌న‌ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో విస్తరింప చేయడమే కాదు .. త‌న‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చ‌కున్నాడు .


అందుకే చిరుకురాజమౌళి అంటే చాలా అభిమానం అంటూ వివ‌రించాడు . ఇక రాజమౌళి తో పాటు సినిమా ఇండస్ట్రీ లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన వి.వి.వినాయక్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు . దానికి కార‌ణం వి.వి . వినాయక్ చిరంజీవి కి రెండు హిట్ సినిమా లను అందిచాడు . అయితే ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అయినా వాటిని కూడా చాలా సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్ది సక్సెస్ కొట్టడం సాధార‌ణ విష‌యం కాదు .. అలాంటిది సులువుగా ఆ సినిమా లను చేసి సూపర్ సక్సెస్ లని అందుకున్నాడు . అందుకే వినాయ‌క్ అంటే కూడా చాలా గౌరవం అంటూ వివ‌రించాడు . ఇలా టాలీవుడ్‌లో ఇద్ద‌రు హీరోలు అంటే చిరుకు ఇష్టం మ‌నే వార్త సోష‌ల్ మిడియ‌లో వైర‌ల్‌గా మ‌రింది.

మరింత సమాచారం తెలుసుకోండి: