ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపును పొందింది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్న దానికి విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం విశేషం. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కాగా, ప్రస్తుతం సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది.
ప్రస్తుతం తన పూర్తి ధ్యాసను బాలీవుడ్ సినిమాలపైనే పెట్టింది. అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.
అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారట. దానికి సమంత కూడా ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో సమంత, అల్లు అర్జున్ సరసన చిందులు వేసింది. కాగా, ఆ పాట ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరోసారి అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తే సినిమానే హైలైట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట.