సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలకృష్ణ తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. ఈ సినిమా అనంతరం బాలయ్య బాబు అఖండ-2 సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లను కూడా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ ను ఈనెల చివరన విడుదల చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. కాగా, ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికోసమే సినిమా షూటింగ్ ను చాలా తొందరగా నిర్వహిస్తున్నారట. దానికి అనుగుణంగా బాలయ్య బాబు ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటుండడం విశేషం. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.