భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ మూవీ ఫస్ట్ షో తో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకి సంబంధించిన వాళ్లందరూ ఆనందంలో మునిగిపోయారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన తండేల్ మూవీ నాగచైతన్య కెరియర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్ క్రియేట్ చేసి రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు దాదాపు 21 కోట్లు వసూలు చేసింది.ఇక నాగచైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇదే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే నాగచైతన్య నటించిన సినిమాలు ఏవి కూడా మొదటి రోజు 20 కోట్లు సాధించలేదు. అలాంటిది తండేల్ సినిమా సాధించడంతో నాగచైతన్య కెరియర్ లో ది బెస్ట్ మూవీ గా ఈ తండేల్ కి చోటు దక్కింది. అయితే తండేల్ మూవీ కి తాజాగా పెద్ద షాక్ తగిలింది.తండేల్ మూవీ మొదటి రోజే కొంప ముంచేశారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే.. తండేల్ మూవీ పైరసీ..

 ఈ మధ్య కాలంలో చాలామంది సినిమా విడుదలైన రెండు మూడు గంటలకే పైరసీ చేస్తూ హెచ్డి ప్రింట్ లో సోషల్ మీడియాలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే పుష్పటు,గేమ్ చేంజర్,డాకు మహారాజ్ వంటి సినిమాల విషయంలో మనం చూసాం.అయితే తాజాగా విడుదలై హిట్ కొట్టిన తండేల్ మూవీ కూడా విడుదలైన మొదటి రోజే పైరసీకి గురైంది.ఈ సినిమాకి సంబంధించి హెచ్డి ప్రింట్ ని సోషల్ మీడియాలోకి అందుబాటులోకి తెచ్చారు కొంతమంది పైరసీ గాళ్లు.దాంతో ఈ విషయం తెలిసిన చిత్ర యూనిట్ పైరసీ చేసిన వాళ్లపై ఫైర్ అవుతోంది.

 అంతేకాదు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని పైరసీ చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు ఈ పైరసీ ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది.అలా తండేల్ మూవీని పైరసీ మొదటి రోజే కొంపముంచింది అని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని సినిమాలు విడుదలైన మొదటి రోజు సోషల్ మీడియాలోకి అందుబాటులోకి వస్తే అంత క్వాలిటీ గా ఉండవు .కానీ తండేల్  మూవీ మాత్రం హెచ్డి క్వాలిటీతో రావడంతో ఇది ఎవరో కావాలనే పైరసీ చేశారు అని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: