![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samantha-naga-chaitanya-sobhita-divorce-clarityfa74f087-d40e-4548-833e-4cd19c791744-415x250.jpg)
రెండో పెళ్లి పైన మాత్రం అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుంది సమంత. కానీ నాగచైతన్య మాత్రం మరొక హీరోయిన్ శోభితని ప్రేమించి వివాహం చేసుకున్నారు. దీంతో సమంతతో విడిపోవడానికి ముఖ్య కారణం శోభితతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు రావడంతో పాటుగా వివాహం కూడా జరగడంతో.. శోభిత పైన సమంత ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నెగిటివిటీ కూడా సృష్టించారు. తాజాగా అన్నిటికీ సైతం నాగచైతన్య చెక్ పెడుతూ తాను సమంతతో విడాకులు తీసుకోవడానికి శోభిత అన్న వార్తలు విన్న తర్వాత తను చాలా బాధపడ్డాను అని తెలిపారు. ఈ నింద ఆమెకు పడాల్సింది కాదు అంటూ తెలిపారు..
శోభిత తన జీవితంలోకి ఇన్స్టా చాట్ల చాలా సాధారణంగా అందంగా వచ్చిందని తెలిపారు. మొదట మా మధ్య కేవలం స్నేహం మాత్రమే మొదలయ్యిందని ఆ తర్వాత అది రిలేషన్ గా మారిపోయిందని తెలియజేశారు నాగచైతన్య. మొత్తానికి సమంతతో విడిపోవడానికి కారణం శోభిత కాదనే విషయాన్ని తెలిపారు. ఇటీవలే నాగచైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి అటు సాయి పల్లవి నటనకు చైతన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి కలెక్షన్స్ విషయంలో కూడా మొదటి రోజు 21 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు సమాచారం.