కానీ కొన్ని కారణాల చేత ఆమెను నో చెప్పడంతో ఆస్థానంలోకి శ్రీలీలనీ తీసుకోవచ్చారట. అయితే బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తమ హీరోయిన్ నటించి ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా తెలుపుతున్నారు. అయితే పుష్ప2 కి ఒప్పుకొని ఈ అమ్మడు ఇప్పుడు వార్-2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేకి ఒప్పుకున్నదట. అయితే అందుకు గల కారణం ఏంటన్నది ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇందులో నటిస్తే యష్ రాజ్ ఫిలిం బ్యానర్ పైన మరిన్ని అవకాశాలు వస్తాయని బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుందనే విధంగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుందేమో అంటూ పలువురి నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం వార్ 2 చిత్రం షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నది ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తూ ఉండగా ఈ కథకి మ్యాచ్ అయ్యే విధంగా చాలా సాంప్రదాయమైన పద్ధతిలోనే ఒక ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. గత ఏడాది స్త్రీ 2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు 850 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.. మరి వార్ 2 శ్రద్ధ కపూర్ కి ఎంత మేరకు కలిసొస్తుందో చూడాలి