టాలీవుడ్ యువ నటు డు విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననురి దర్శకత్వం లో VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తు న్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇకపోతే ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు . కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం . మొదట ఒక భాగాన్ని రూపొందించి దానికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చినట్లయితే రెండవ భాగాన్ని స్టార్ట్ చేస్తాం అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా టైటిల్ మరియు టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టైటిల్ మరియు టీజర్ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యొక్క టీజర్ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సంబంధించిన టీజర్ను తెలుగు , తమిళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ తెలుగు వెర్షన్ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా , తమిళ్ వెర్షన్ కి సూర్య , హిందీ వర్షన్ కు రన్బీర్ వాయిస్ ఓవర్ ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా టీజర్ను కోసం ముగ్గురు స్టార్ హీరోలను విజయ్ రంగం లోకి దింపుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd