ఇక అల్లు అర్జున్ ఓ పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఆమె కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిందని అంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పుష్ప 2 థాంక్స్ మీట్ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమాలో పుష్ప కూతురిగా నటించిన పావని కరణం ఎమోషనల్ అయింది.
ఆమె మాట్లాడుతూ.. 'ఈ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన మైత్రి టీమ్ కి థాంక్స్. ఎందుకంటే.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నా క్యారెక్టర్ కి కూడా ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను నిద్రలో లేచి ఏడిచేదాన్ని ఎందుకంటే నేను ఎవరికి థాంక్స్ చెప్పుకోలేకపోయాను. ఆ బాధను తీర్చుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. బన్నీ సర్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని.. ఈ మాట సెట్ లో చెప్పే అవకాశం ఎప్పుడు నాకు దొరకలేదు. ఈ అవకాశం ఇచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు థాంక్స్. మీతో కలిసి కావేరీ పాత్ర చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ సర్ మీరు నాకు లైఫ్ ఇచ్చారు. ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకున్నారు. మీ సపోర్ట్ వల్లే నేను ఈ రోల్ ప్లే చేశాను' అంటూ పావని కంటతడి పెట్టుకుంది.