టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య సోలో హీరోగా ఆఖరుగా నటించిన ఆఖరి 7 సినిమాలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

నాగచైతన్య తాజాగా తండెల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.54 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

నాగ చైతన్య కొంత కాలం క్రితం కష్టడి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కృతి శెట్టి ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.82 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.

నాగ చైతన్య హీరోగా రూపొందిన థాంక్యూ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి 1.65 కోట్ల షేర్ కలెక్షన్లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి.

చైతన్య హీరోగా రూపొందిన లవ్ స్టోరీ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.3 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మజిలీ మూవీలో చైతన్య హీరోగా నటించగా దివ్యాంశా కౌశిక్ , సమంత హీరోయిన్లుగా నటించారు. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

నాగ చైతన్య హీరోగా రూపొందిన సవ్యసాచి మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 3.29 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

నాగ చైతన్య హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో రూపొందిన శైలజ రెడ్డి అల్లుడు మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.93 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: