సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించనివి చాలా జరుగుతూ ఉంటాయి . అది ఏ హీరో విషయంలోనైనా సరే.. ఎంత పెద్ద స్టార్ హీరో విషయంలోనైనా సరే . అలాంటి సంధర్భాలు చాలానే ఉన్నాయి.  మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ కెరియర్లో అట్టర్ ప్లాప్ మూవీస్ ని ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ లో తమ ఖాతాలో వేసుకున్నారు . దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .


కాగా మెగాస్టార్ చిరంజీవిసినిమా చూస్ చేసుకున్న కూడా మంచి కథ ఉంటుంది అని జనాలు ఎంకరేజ్ చేస్తారు అని జనాలు భావిస్తూ ఉంటారు.  కానీ మెగాస్టార్ చిరంజీవి "మృగరాజు" సినిమాను ఎందుకు ఓకే చేశాడు అంటూ చాలామంది మాట్లాడారు . అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటూ జనాల ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు.  మెగా ఫాన్స్ కూడా మండిపడ్డారు . అంతేకాదు మృగరాజు సినిమా చిరంజీవి జీవితానికి ఎలాంటి మైనస్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్  తెచ్చిందో అలాగే రామ్ చరణ్ కెరీర్ కి కూడా ఒక సినిమా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చింది .



సినిమా మరేదో కాదు "ఆరెంజ్". ఆరెంజ్ సినిమాలో నటించిన తర్వాత రామ్ చరణ్ ని అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకురా హీరోగా వచ్చావు అంటూ చాలామంది జనాలు ట్రోల్ చేశారు. అంతలా ఈ సినిమా పరమ చెత్త టాక్ దక్కించుకుంది. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . రామ్ చరణ్ ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు . కానీ ఫ్లాప్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి మృగరాజు సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అదే విధంగా రాంచరణ్ పెట్టుకున్నారు. రెండు సినిమాలు ఢమాల్ అంటే ఫ్లాప్ అయ్యాయి. ఇద్దరికీ ఆ సినిమాలు నెగిటివ్గా మారిపోయాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: