![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rajini-opens-up-about-energy-a-secret-practice-for-21-years23d0a6f5-261f-49d8-af26-ffa63fa9b928-415x250.jpg)
ఇక రజినీకాంత్ అంటే కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇండస్ట్రీ హిట్ రికార్డులు తిరగరాయడం ఒక్క రజనీకాంత్‌కే చెల్లింది. అంతేకాదు.. ఆయన ఇండియన్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో టాప్ 5 ప్లేస్‌లలో ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు అక్షరాల రూ. 180 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే రజినీకాంత్ వయసు 74 దాటినప్పటికీ, ఆయన మాత్రం యూత్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే రజినీ ఎనర్జీని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి రజినీకాంత్ ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉండడానికి.. ఆయన 21 ఏళ్లుగా రహస్య సాధన చేస్తున్నారంట. అలాగే రజినీకాంత్ ఎనర్జీ గురించి ఆయన ఓపెన్ అయ్యారు.
ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆందోళనలు లేకుండా జీవితాన్ని గడిపేందుకు.. ఒక ప్రత్యేకమైన పద్దతిని పాటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రత్యేకమైన పద్దతి పేరే క్రియా యోగా అని చెప్పుకొచ్చారు. ఇటీవల రజిని కాంత్ దీని గురించి మాట్లాడుతూ.. 'ఈ క్రియా యోగా సాధారణమైన సాధన కాదు. దీన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికే నాకు 10 నుండి 12 సంవత్సరాల సమయం పట్టింది. మొదట్లో నేను చాలా ప్రయత్నాలు చేశాను. అయినప్పటికీ నాకు ఎలాంటి ఫలితం రాలేదు. తర్వాత మెల్లమెల్లగా అర్దం అయింది. ఇప్పుడు ప్రతిరోజూ నేను ద్యానం చేయడం నా జీవితంలో భాగమైంది' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.