నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొంది న అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా లో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుం ది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ మూవీ విడుదల అయిన తర్వాత కొంతకాలానికి ఈ సినిమాకి కొనసాగింపుగా అఖండ 2 మూవీ ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇకపోతే బాలకృష్ణమూవీ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజు సినిమాలలో నటించి మూడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకోగా బోయపాటి శ్రీను "స్కంద" మూవీ కి దర్శకత్వం వహించి అపజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను "అఖండ 2" మూవీ ని మొదలు పెట్టాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఆఖండ 2 మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక అదే సెంటిమెంట్ తో అఖండ 2 మూవీ లో ఆది పినిశెట్టిని మరోసారి బోయపాటి శ్రీను రిపీట్ చేస్తున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో అఖండ 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: