![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroin-mano-chitra-ajith-moive-veram-movie-e76082c4-c3c3-4dc3-b2d9-f7b0e2680f72-415x250.jpg)
ఇక ఈమె తెలుగు ,తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది. ఈమె తెలుగులో మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత నాటుకోడి, జైసేన తదితర చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. అజిత్ నటించిన వీరం సినిమాలో నటించినప్పుడు జరిగిన ఒక చేదు సంఘటన గురించి ఈమె మాట్లాడడం జరిగింది. వీరం సినిమా 2014లో విడుదలయ్యింది. ఈ చిత్రానికి డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ చాలా చోట్ల జరిగిందని ఈ సినిమాలో తాను బాగా నటించి పెద్ద హీరోయిన్గా పేరు తెచ్చుకుంటాంననుకున్నదట.
కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు చాలా ప్రశ్నలు తలెత్తాయని వెల్లడించింది.. డైరెక్టర్ తనకు కథ చెప్పినప్పుడు తమన్నా ఈ చిత్రంలో సగంలోని మరణిస్తుందని ఆ తర్వాత నువ్వు అజిత్ సరసన నటించాల్సి ఉంటుందని చెప్పడంతో తాను కూడా ఓకే చెప్పానని తెలిపింది. కానీ సినిమా షూటింగ్లోకి వెళ్లిన తర్వాత అతను చెప్పింది అంతా అబద్ధమని తెలిసిందట. అలా షూటింగ్ స్పాట్లో ఉండడం తనకు నచ్చలేదని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాలి కానీ అందరూ అక్కడ నచ్చ చెప్పారని.. అలా కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. చివరికి చిత్ర బృందం ఫోన్ చేసి కేవలం రెండు రోజులు నటించమని అడిగారట. అయితే ఆ సినిమాలో నటించడానికి ఏకైక కారణం అజిత్ సరే అని.. తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలలో తమిళ సినీ కెరియర్ పైన అత్యంత ప్రభావం చూపించినటువంటి చిత్రమే వీరం అని తెలిపింది.