విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయ్యి 25 రోజులు పూర్తి అయ్యింది.

ఇప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే విడుదల అయిన 25 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 42 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక 25 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 129.18 కోట్ల షేర్ ... 209.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే 25 వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 49 లక్షల షేర్ ... ఒక కోటి గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 25 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 154.84 కోట్ల షేర్ ... 267.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి.

ఈ మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 41.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 42.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 112.34 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా మంచి హోల్డ్ ను కనబరుస్తూ వస్తోంది. దానితో మరికొన్ని రోజుల పాటు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: