టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో ఆయన నటించిన సినిమా టైటిల్స్ ను చాలా మంది హీరోలు తమ సినిమాలకు పెట్టుకుంటూ వెళుతున్నారు. ఇప్పటి వరకు పవన్ నటించిన చాలా సినిమాల టైటిల్స్ ను ఇతర హీరోలు వాడుకున్న సందర్భాలు ఉన్నాయి.

కొంత కాలం క్రితం వరుణ్ తేజ్ , పవన్ సూపర్ హిట్ మూవీలలో ఒకటి అయినటువంటి తొలిప్రేమ టైటిల్ ను వాడుకొని తాను కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ , పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి ఖుషి సినిమా టైటిల్ ను వాడుకున్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ , పవన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన తమ్ముడు సినిమా టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అయినటువంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ తో కూడా ఓ మూవీ రాబోతుంది. ఇలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన నాలుగు సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ను కొంత మంది హీరోలు వాడుకున్నారు.

ఇకపోతే పవన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన జానీ మూవీ టైటిల్ ను కూడా మరో యువ నాయకుడు వాడుకోబోతున్నాడు. టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత జానీ అనే టైటిల్ తో రూపొందబోయే సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా శర్వానంద్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ను వాడుకోబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: