ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఓయ్, 7G బృందావన కాలనీ, ఆరెంజ్, గబ్బర్ సింగ్, మురారి, ఇంద్ర, భద్రి, త్రీ, లీడర్, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి. సినిమాలతో సమానంగా రీరిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
ఇక ఈ రీరిలీజ్ మూవీస్ తో మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఈ సారి రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పుడు రాబోయే ప్రేమికుల రోజు సందర్భంగా కొత్త సినిమాలతో పాటు రీరిలీజ్ కి ఓల్డ్ మూవీస్ కూడా రెఢీ అయ్యాయి. అయితే రిలీజ్ అయ్యి సందడి చేసే రీరిలీజ్ మూవీస్ లిస్ట్ ఏంటో తెలుసుకుందాం.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి మూవీ వచ్చే నెలలో రీరిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఒక్క మంచి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ రీరిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇప్పుడు మాత్రం మంచి హిట్ కొడుతుంది. గోదావరి అందాలను తెరపైన చక్కగా చూపిస్తూ ఈయన తీసిన సినిమా గోదావరి. ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ నటించారు. ఈ సినిమా చూసినంత సేపు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా రామ్ చరణ్ నటించిన లవ్ స్టోరీ ఎంటర్ టైనర్ మూవీ ఆరంజ్ రిలీజ్ కానుంది. అలాగే ఇప్పటికే సనమ్ తేరి కసమ్ మూవీ కూడా రీరిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టింది. ఇక శివరాత్రికి బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా రీరిలీజ్ అవ్వనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: