టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నిర్మాత లలో సాహు గారపాటి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం నందమూరి బాలకృష్ణ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు నిర్మాతగా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే తాజాగా ఈ నిర్మాత విశ్వక్ సేన్ హీరో గా లైలా అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ నుంచి ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ నిర్మాత వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సాహు గారపాటి మాట్లాడుతూ ... లైలా సినిమాలో విశ్వక్ సేన్ అమ్మాయి గెటప్ లో కనిపించాడు. ఈ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ మూవీ కథను ముగ్గురు హీరోలకు వినిపించాం. వారు ఈ సినిమాలో హీరో లేడీ గెటప్ లో కనిపించాలి అనే సరికి సినిమా చేయము అని చెప్పారు.

విశ్వక్ సేన్ మాత్రం ఈ సినిమా చేశాడు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యక్తులు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సాహూ గారపాటి , మెగాస్టార్ చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని సాహు గారపాటి , అనిల్ రావిపూడి అధికారికంగా ధ్రువీకరించారు.  మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: