కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటే పరిచయాలు అక్కర్లేని పేరు. అయితే అలాంటి ఈ హీరో పై నిత్యా మీనన్ నిజంగానే ఆరోపణలు చేసిందా.. ఇద్దరి కాంబోలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి.అలాంటిది వీరిద్దరి మధ్య వైరం ఎక్కడ పుట్టింది అని చాలామంది లో ఒక అనుమానం ఉంటుంది.అయితే నిత్యమీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని బయట పెట్టింది. అయితే హీరో పేరు బయట పెట్టకుండా సెట్లో ఆ హీరో చాలా ఈగో చూపిస్తారు అంటూ నిత్యమీనన్ మాట్లాడడం ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ నిత్యమీనన్ ఏం మాట్లాడిందయ్యా అంటే.. ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అందులో నటించిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ కొంతమంది హీరోలు అయితే పైకే ఇలా మాట్లాడతారు. కానీ లోపల మాత్రం వేరుగా ఉంటారు.

అలాగే వారు ప్రవర్తించే ప్రవర్తనకు వారు మాట్లాడే మాటలకు ఎలాంటి పొంతన కూడా ఉండదు. పైకి గౌరవిస్తున్నట్టు నటిస్తూ సెట్ లో మాత్రం చాలా ఈగోని ప్రదర్శిస్తారు. అంతేకాదు మధ్య మధ్యలో మన మీద  అరుస్తారు కూడా.. అంటూ నిత్యా మీనాన్ చెప్పుకొచ్చింది.అయితే నిత్యమీనన్ ఆ హీరో పేరు చెప్పకపోయినప్పటికీ అందరూ ధనుష్ ని ఉద్దేశించే ఈ మాటలు మాట్లాడింది అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలామంది ధనుష్ అభిమానులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు.

ఒకవేళ నిత్యమీనన్ మాట్లాడింది ధనుష్ గురించి అయితే మాత్రం అందులో అస్సలు నిజం లేదు. ఇప్పటివరకు నిత్యమీనన్ ధనుష్ లు కలిసి నటించారు. అలాంటిది నిత్యమీనన్ ధనుష్ పై ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తుంది. అలాగే నిత్యమీనన్ ని చాలాసార్లు ధనుష్ పొగిడారు అంటూ ప్రూఫ్ లతో సహా కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: