
అయితే తక్కువ సినిమాలకే పరిమితం కావడం గురించి అన్షు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్షు మాట్లాడుతూ తాను మళ్లీ సినిమాలు చేయడానికే ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. కథాబలం ఉన్న సినిమాలలో వైవిధ్యభరిత పాత్రలను పోషించాలని ఉందని అన్షు తెలిపారు. ఏ తరహా పాత్రతో వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించడం గమనార్హం.
15 సంవత్సరాల వయస్సులోనే సినిమాల్లోకి వచ్చానని మన్మథుడు, రాఘవేంద్ర సినిమాలు చేశానని ఆమె తెలిపారు. నిజానికి అప్పటికి నాకు ఇంత పరిణతి లేదని ఆమె చెప్పుకొచ్చారు. నేను యాక్టింగ్ ను కెరీర్ గా భావించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత లండన్ కు వెళ్లి సైకాలజీలో మాస్టర్స్ చేశానని ఆమె కామెంట్లు చేశారు. మన్మథుడు రీరిలీజ్ కావడం వల్లే మళ్లీ సినిమాలపై ఆసక్తి కలిగిందని ఆమె పేర్కొన్నారు.
మన్మథుడు రీరిలీజ్ కోసం నేను ఇచ్చిన వీడియో బైట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని అన్షు వెల్లడించారు. మజాకా హిట్టైతే అన్షుకు తెలుగులో ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అన్షు రీఎంట్రీలో కూడా కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అన్షు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. మన్మథుడు సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించిన హీరోయిన్ అన్షును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.