సినీ నటి రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది. 
ప్రస్తుతం రష్మిక, బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో ఛావా సినిమాలో నటిస్తుంది. ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా టైలర్ రిలీజ్ వేడుక ముంబాయిలో జరిగింది. కాలికి గాయం అయినప్పటికీ ఆ ఈవెంట్ కి రష్మిక వచ్చింది. 
అయితే ఆమె ఆసుపత్రిలో తలకు కట్టు కట్టుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమెని కలిసేందుకు హీరో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, మహేష్ బాబు వెళ్తున్నట్లు ఫొటోలతో కలిపి ఉన్న పోస్టులు కూడా పెడుతున్నారు. అంతేకాదు రష్మిక ఆరోగ్య పరిస్తితి బాలేదని వరుసగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి వాటిలో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.
అయితే హీరోయిన్ రష్మిక ఆరోగ్యంగా లేరని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఆమెకి కాలికి దెబ్బ తగిలింది.. దానికోసం ఆమె ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటుంది. ఆమె పరిస్తితి బాగుంది, అలాగే ఆరోగ్యంగానే ఉంది. ఆమె ఛావా సినిమా ట్రైలర్ లంచ్ కి వాకర్ సహాయంతో హాజరయ్యింది.  వైరల్ అవుతున్న రష్మిక అనారోగ్య ఇమేజ్, మర్పింగ్ చేసినట్లు స్పష్టం అయింది. ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: