మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ సినిమాలో నటిస్తూ ఉన్నది. గతంలో మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తమిళ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా మీద ఆశలు పెట్టుకున్న మాళవిక మోహన్ ఈ సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక లోకేష్ కనకరాజు మాస్టర్ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే కూలి సినిమా గురించి డిస్కషన్ పెట్టారట.


అయితే రజనీకాంత్ కూతురుగా ముందు మాళవికానే  అనుకున్నారని అయితే ఆ తర్వాత ఆ అవకాశం మిస్ అయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నది. ఇందులో శృతిహాసన్ ఫిమేల్ లీడ్ లో కూడా నటిస్తూ ఉన్నది. అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. రజనీకాంత్ కూతురుగా ఈ చిత్రంలో శృతిహాసన్ కనిపించబోతోంది. అయితే ఈ పాత్రను మాళవిక మోహన్ ఎందుకు వద్దనుకున్నదో తెలియదు కానీ మాళవిక ప్లేసులో శృతిహాసన్ చేరడం జరిగిందట.


ఇటీవలే డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో శృతిహాసన్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో వల్లే ఆమెకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు అనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసమే అడవి శేషుతో నటించే డేకాయిడ్ సినిమా అవకాశాన్ని కూడా వదిలేసిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ ప్లేసులో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్గా ఎంపిక చేశారు. గత ఏడాది ప్రభాస్ తో సలార్ 1 చిత్రంలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే శృతిహాసన్ కి మాత్రం కెరియర్ మీద పెద్దగా ఫోకస్ లేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. గత కొంతకాలంగా ఈమె బాయ్ ఫ్రెండ్ రూమర్స్ తో చాలా ఇబ్బంది పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: