- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్‌ పాత్రలో బ‌న్నీ చేసిన విధ్వంసం బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ లో నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ లో స్ట్రీమింగ్ కూడా అవుతుంది రెస్పాన్స్ దక్కుతుంది. ఓటీటీ లో స్ట్రిమింగ్ అవుతున్న అల్లు అర్జున్ సినిమాలు నెట్ ప్లిక్స్‌ తన ప్లాట్ ఫార‌మ్ నుంచి త్వరలోనే తొలగించనుంది. దీంతో అభిమానులు అందరు ఒక్కసారి షాక్ అయి పోతున్నారు. అయితే ఇది పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ కాదు ... అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అలవైకుంఠపురంలో ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ రైట్స్ సన్ నెట్వర్క్ దక్కించుకుంది. అలవైకుంఠపురంలో సినిమా నాన్ ఎక్స్‌క్లూసివ్ రైట్స్ రూపంలో అగ్రిమెంట్ ప్రకారం ఇంత కాలం స్ట్రీమింగ్‌ చేసింది. ఇప్పుడు ఈ రైట్స్ కు సంబంధించిన అగ్రిమెంట్ డేట్ ముగియనుంది. దీంతో ఈ సినిమా చివరిగా ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో కనిపించదు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమాను ఇక నుంచి సన్ నెక్స్ట్  ప్లాట్ఫాంలో ఎక్స్ క్లూజివ్ గా వీక్షించవచ్చు. ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం కాస్త గ్యాప్ తీసుకుని త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: