![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-rajamouli-1eb9e8e9-51fe-4d88-b184-58264669bc1d-415x250.jpg)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి సినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా మొదలైంది. ఇప్పటికే మహేష్ బాబు - ప్రియాంక చోప్రాలపై ఓ కీలక సన్నివేశాన్ని ఐదు రోజులపాటు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో షూట్ చేశారు. రాజమౌళి తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే బదులు కానుంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నానా పటేకర్ కనిపించబోతున్నారని .. ఇప్పటికే ఆయనపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారా ? అనేది ఆసక్తిగా ఉంది. నానా పటేకర్ ను తీసుకుంది మహేష్ బాబు తండ్రి పాత్ర కోసమా ? లేదా మరో పాత్ర కోసమా అన్నదానిపై క్లారిటీ లేదు.
మరోవైపు ఈ సినిమా టైటిల్ కోసం కూడా ఇప్పటినుంచే రాజమౌళి అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మహారాజ్ - గరుడ అనే టైటిల్స్ సినిమా కోసం ముందుగా అనుకున్నారు. అయితే ఈ రెండు టైటిల్ ఇప్పుడు పాతవి అయిపోయాయి. అందుకే వాటిని పక్కన పెట్టేసారని తెలుస్తోంది. ఇప్పుడు జన రేషన్ అనే అర్థం వచ్చేలా ఓ పాన్ వరల్డ్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఈ కథకు తరతరాల లింక్ ఉంది .. అందుకే అలాంటి టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారట రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని రాజమౌళి బయటకు రివిల్ చేయనివ్వడం లేదు. కనీసం ప్రియాంకా చోప్రాని హీరోయిన్ గా తీసుకున్న సంగతి కూడా మీడియాకు చెప్పలేదు. మీడియాలో ఎన్ని రకాల వార్తలు వస్తున్నా వాటిపై రెస్పాండ్ అవ్వడం లేదు. మరి రాజమౌళి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో ? చూడాలి.