![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjun75bb7a17-2a7f-4190-b231-f007fb1ff410-415x250.jpg)
అక్కడ కూడా ఓ రేంజ్ లో దున్నేస్తుంది . ఈ క్రమంలోనే సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడం పట్ల చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది . సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి షీల్డ్స్ బహూకరించింది . ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన అల్లు అర్జున్ చాలా హుందాగా మాట్లాడాడు . ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూ వచ్చారు. పేపర్ చూసి చదువుతున్నాడు అని .. ఆయనను అసలు దారుణంగా కామెంట్ చేశారు . కాగా ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా హుందాగా ప్రవర్తించారు . అయితే ఆయన మాటల్లో ఎటువంటి తప్పులు లేనప్పటికీ కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారు . అల్లు అర్జున్ ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అని .. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం ప్రతి ఒక్కరు అని.. పుష్ప ఉన్న ప్రతి చోటా రష్మిక ఉంటుంది అని ..రష్మిక ఉన్న ప్రతి చోట పుష్ప ఉంటుందని చెప్పుకొచ్చారు".
అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి అందరూ బాగా వర్క్ చేశారని కూడా పొగిడేసారు. సినిమాలో ఎంతమంది నటీనటులు వర్క్ చేసి హిట్ ఇచ్చేది మాత్రం దర్శకుడు అంటూ కూడా మాట్లాడారు. నటీనటులు ఎంత కష్టపడినా.. దర్శకుడు
సినిమాకి కరెక్ట్ వర్క్ చేయకపోతే.. ఆ సినిమా ప్లాప్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఎంత పెద్ద తోపైనా స్టార్ అయిన పెద్ద హీరో అయినా డైరెక్టర్ చెప్పిన విధంగానే చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందని ..సరైన మార్గ నిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు అని అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే అంటూ చెప్పుకు వచ్చాడు. నన్ను గైడ్ చేసినందుకు సుకుమార్ కి చాలా థాంక్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ బడా హీరోని టార్గెట్ చేశాడు అంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మరొక్కసారి అల్లు అర్జున్ పేరుని బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!