అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప- 2. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన మొదటి షోతోనే ఈ సినిమా సక్సెస్ సాధించి భారీగా కలెక్షన్లను సైతం రాబట్టింది. ఈ సినిమాను 12,500 స్క్రీన్ లలో రిలీజ్ చేయడం గమనార్హం. కాగా, పుష్ప సినిమా భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. 

సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతిబాబు వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. పుష్ప-2 సినిమా విడుదలైన మొదటి రోజు పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా అల్లు అర్జున్ కాస్త బాధలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక నిన్న సాయంత్రం పుష్ప-2 సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం అందరూ విచ్చేసి సందడి చేశారు.


అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. పుష్ప-2 సినిమా ఎండింగ్ సమయంలో పార్ట్-3 ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. పుష్ప-3 సినిమా అదేంటో నాకు తెలియదు, నీకు తెలియదు అని అన్నారు. అది ఒక అద్భుతం లాగ ఎనర్జీ అయితే ఉంది అని బన్నీ దర్శకుడు సుకుమార్ ను ఉద్దేశించి అన్నారు.

షూటింగ్ జరుగుతున్న సమయంలో జాతర సీన్లు చేయలేనని నేను పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అల్లు అర్జున్ అన్నారు. అన్ని అడ్డంకులను దాటుకొని సినిమాను విజయవంతంగా పూర్తి చేశానని అల్లు అర్జున్ మాట్లాడారు. కాగా, ఈ సినిమా సక్సెస్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉందని అల్లు అర్జున్ వెల్లడించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: