
ఆస్కార్ అవార్డుతోను ఆర్.ఆర్.ఆర్ సినిమా పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి ఒక్క సినీ అభిమాని ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా తీసారో వీడియో ద్వారా మేకర్స్ తాజాగా రివిల్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ఆ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు 10 నిమిషాల పాటుగా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సీన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తారక్ ఎంట్రీ సీన్ కు ఈ సినిమాలో ఎంత పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ ఎంట్రీ కూడా అంతే పాపులారిటీని సంపాదిస్తోంది.
ఈ ఒక్క సీన్ తీయడానికి దాదాపు 32 రోజుల సమయం పట్టినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.