స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వస్తే చాలా మంది నటీమణులు ఎంతో ఆనందపడతారు. తమ లైఫ్ సెట్ అయిపోయింది అని భావిస్తూ ఉంటారు. కానీ ఓ ముద్దు గుమ్మ మాత్రం ఓ తమిళ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినందుకు బాధపడుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరు ..? ఏ స్టార్ హీరో సినిమా వల్ల తనకు ఏ మాత్రం మంచి జరగలేదు అని చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణులలో మనోచిత్ర ఒకరు. ఈమె అనేక తమిళ సినిమాలలో నటించింది.

ఇకపోతే ఈమె మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఇచ్చింది. ఇకపోతే ఈమె కొన్ని సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ హీరోగా రూపొందిన వీరం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ద్వారా తనకు ఏ మాత్రం మంచి జరగలేదు అని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నాకు దర్శకుడు మొదట వీరం సినిమా కథను చెప్పినప్పుడు ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ , కాకపోతే ఆమె పాత్ర సినిమా మధ్యలోనే చనిపోతుంది. ఆ తర్వాత మీ పాత్రతోనే సినిమా ముందుకు వెళుతుంది అని చెప్పాడు. దానితో నేను ఎంతో సంతోషపడ్డాను.

కానీ సినిమా స్టార్ట్ అయ్యాక అక్కడ నాకు చెప్పిన కథ తాలూకు సన్నివేశాలు జరగడం లేదు. ఇక దాదాపు తమన్నా తర్వాత మెయిన్ లీడ్ అని చెప్పారు  కానీ ఆ సినిమాలో కేవలం నన్ను రెండు రోజులు మాత్రమే డేట్స్ అడిగారు. దానితో నేను చాలా బాధపడ్డాను. కానీ అజిత్ కుమార్ సినిమా అని నేను ఆ సినిమాలో నటించాను అని మనోచిత్ర తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: