ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నట్టుగానే నాగచైతన్య - సాయి పల్లవి తండేల్ సినిమాకు కాస్త మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ లెక్కలు చూడాలి .. ఈ సినిమాను దాదాపు 80 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు.. అన్ని ఏరియాలు అమ్మలేదు .. అడ్వాన్సులు కూడా తీసుకోలేదు. అందుకే సినిమాను 90% ఏరియాలలో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు.. కొద్దిగా విక్రయించారు. ఇలా విక్రయించడం వల్ల దియేటర్ మీద నుంచి 25 కోట్లు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. అంటే మరో 15 కోట్లు నిర్మాతల మీద బర్డెన్ ఉండనే ఉంది. ఇది అలా ఉంచితే రెండు రాష్ట్రాల పంపిణీ దారుల నుంచి తీసుకున్న 25 కోట్లకు మాత్రం డోకా లేదని క్లారిటీ తొలి రోజే వచ్చేసింది. రాయలసీమ - ఆంధ్రప్రదేశ్ ఏరియా నుంచి 12 కోట్లు అడ్వాన్సులు తీసుకున్నారు. విశాఖ ఏరియా మూడు కోట్లు పడింది. మొదటి రోజునే 90 లక్షల షేర్ వచ్చింది. రెండు మూడు రోజులు కలిపిన ఎంత తక్కువ లేదనుకున్న రెండు కోట్లు షేర్ ఉంటుంది.
ఫస్ట్ వీకెండ్ తర్వాత జస్ట్ ఒక కోటీ వస్తే చాలు .. అంటే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇదే పరిస్థితి అన్ని ఏరియాలలోను కనిపిస్తోంది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో అడ్వాన్స్గా తీసుకున్న పాతిక కోట్ల మేరకు అస్సలు సమస్య లేదు. కానీ కావాల్సింది అది కాదు .. మరింత కలెక్షన్లు .. మరింత ఓవర్ ప్లోస్ .. నిర్మాత బన్నీ వాస్ టార్గెట్ అదే. థియేటర్ల మీద నుంచి కనీసం మరో 15 కోట్లు ఓవర్ ప్లోస్ వసూలు చేయాలి. అప్పుడే నిర్మాతగా బన్నీ వాస్ కాస్త రిలాక్స్ అవుతారు. గీత సంస్థలో బన్నీ వాస్‌కు సరైన బ్లాక్ బస్టర్ హిట్టు పడి చాలా రోజులు అయింది. హీరో నాగచైతన్యకు సరైన హిట్టు పడి చాలాకాలం అయింది. పుష్ప సీరిస్ ను పక్కన పెడితే దేవిశ్రీ ప్రసాద్కు మంచి పేరు వచ్చి చాలా అంటే చాలా రోజులు అవుతుంది. ఇలా అన్ని విధాలుగా తండేల్ సినిమా చాలామందికి పెద్ద బూస్ట్ అప్ ఇచ్చింది. ఇక ఇవ్వాల్సింది భారీ లాభాలు మాత్రమే.