- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు కెరీర్ .. అటు రాజకీయాలు అన్ని రంగాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వాడుకుంటున్నారు. శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. శర్వానంద్ నటిస్తున్న తాజా సినిమా నారి నారి నడుమ మురారి. ఈ సినిమా ఒకప్పుడు బాలయ్య హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శర్వానంద్ మరో యూత్ ఫుల్ సినిమా లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ ఫిక్స్ చేయనున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన జానీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.


గీతా ఆర్ట్స్ సంస్థ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించి న ఈ సినిమా లో రేణు దేశాయ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు ర‌మ‌ణ గోగుల సంగీతం అందించారు. 2023 లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ను బాగా డిజ‌ప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్లాప్ సినిమా టైటిల్‌ శర్వానంద్ తన నెక్స్ట్ మూవీకి వాడుకోనున్నాడట. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెర‌కెక్కించనున్న ఈ సినిమాలో శర్మానంద్‌ హీరోయిన్గా నటించమన్నాడు. యూవీ క్రియేషన్స్సినిమా నిర్మిస్తోంది. దీనికి జానీ టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్లాప్ టైటిల్ శ‌ర్వానంద్ కు అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: