కొన్ని సినిమాలలో కథ , కంటెంట్ అన్ని బాగున్న కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయిన సమయంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు. కానీ ఆ తర్వాత ఆ సినిమాలు బుల్లి తెరపై అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన బుల్లి తెరపై మాత్రం హిట్ అయినవి ఉన్నాయి. అలాంటి సినిమాల గురించి తెలుసుకుందాం.

మహేష్ బాబు : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే మహేష్ కొన్ని సంవత్సరాల క్రితం ఖలేజా , 1 నేనొక్కడినే అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ఈ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తూ వస్తున్నాయి.

రామ్ చరణ్ : ఈయన నటించిన ఆరెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ప్రభాస్ : ఈయన నటించిన సినిమాలలో మున్నా సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆదరణ దక్కలేదు. కానీ ఈ సినిమాకు ఆ తర్వాత బుల్లి తెరపై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ప్రభాస్ హీరోగా రూపొందిన చక్రం మూవీ కి కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ దక్కలేదు. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బుల్లి తెరపై మంచి రెస్పాన్స్ దక్కింది.

అల్లు అర్జున్ : ఈయన హీరో గా రూపొందిన ఆర్య 2 మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆదరణ దక్కలేదు. కానీ ఈ సినిమాకు బుల్లి తెరపై మాత్రం అద్భుతమైన ఆదరణ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: