మన్మథుడు సినిమాతో హీరోయిన్ అన్షు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. త్వరలో మజాకా సినిమాతో అన్షు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే మన్మథుడు సినిమా రీరిలీజ్ వల్లే తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.
 
సినిమా రీరిలీజ్ వల్లే హైదరాబాద్ కు వచ్చానని కామెంట్లు చేశారు. హీరోయిన్ అన్షు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అన్షు ఎంతో కష్టపడి కెరీర్ పరంగా ఎంతో ఎదుగుతున్నారు. అన్షు రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. మజాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని అన్షు ఫీలవుతుండటం గమనార్హం.
 
అన్షు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. సీనియర్ హీరోయిన్ల కొరత ఉన్న నేపథ్యంలో అన్షుకు ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అన్షుకు సీనియర్ హీరోల సినిమాలలో ఆఫర్లు వస్తే ఆమె కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్షు వయస్సు కేవలం 39 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
 
అన్షు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే కెరీర్ పరంగా తిరుగుండదు. నాగ్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ లో అన్షు నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్షు రెమ్యునరేషన్ పరంగా అంతకంతకూ ఎదిగితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్షు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్షు అంబానీకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. అన్షు అంబానీకి రీఎంట్రీ కెరీర్ పరంగా ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: