టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ సినిమాకు యూ ఎస్ ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యూ ఎస్ ఏ కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు యూ ఎస్ ఏ లో 550 కే ప్లస్ క్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే గతంలో నాగ చైతన్య , చందు మండేటి కాంబినేషన్లో ప్రేమమ్ , సవ్యసాచి అనే మూవీ లు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ వీరి కాంబోలో వచ్చిన తండెల్ మూవీ కి మాత్రం మంచి పాజిటివ్ రావడంతో ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకునే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: