![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/acter-rediskling-wife-pregent-semantam-photos-viral117ad63f-5dd4-44e8-a358-9c6aa8195c89-415x250.jpg)
అయితే ఇవేవీ పట్టించుకోని ఆయన వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే రెడిన్ భార్య సంగీత ఇప్పుడు తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా అభిమానులతో ప్రకటించారు. సంగీతం సీమంతానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సంగీత మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టా లో ఈ విషయం పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతుండడంతో కొందరు వావ్ గ్రేట్ అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.మొత్తానికి అయితే 45 ఏళ్ల వయసులో సంగీత కూడా తల్లి కాబోతుండడం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెడిన్ విషయానికి వస్తే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ అబ్బురపరిచారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే అటు వ్యక్తిగతంగా ఇటు కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారని చెప్పవచ్చు