![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/monalisaa8abc35b-3d2d-4986-b9ab-3f9652cdbce0-415x250.jpg)
అలాగే ఆమె అందానికి నేటిజిన్స్ కూడా ఫిదా అయిపోయారు .. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆమెని వైరల్ చేసి పడేశారు .. పూసలు అమ్ముకోవడానికి సైతం వీలు లేకుండా ఆమె వెంటపడి మరి వీడియోలు ఫోటోలు తీసేవారు .. దీంతో కుంభమేళాలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగడంతో ఆమె సొంతూరుకు వెళ్లిపోయింది. తన తేనెకలతో ఎంతోమంది కుర్రాలను ఆకట్టుకున్న ఈ అమ్మాయికి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా హీరోయిన్ గా భారీ అవకాశమిచ్చారు .. ఆయన తెరకెక్కించే ఓ సినిమాలో ఆమెకు ఒకీలక పాత్ర ఇవ్వనన్నట్లుగా చెప్పుకొచ్చారు .. ది డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో మోనాలిసా నటించబోతుంది .. ఇప్పటికే ఆమె ఉంటున్న గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించారు ..
ఇక సినిమాకు ఆమెతో అగ్రిమెంట్ కూడా తీసుకున్నారు .. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుకావడానికి మరో నెల రోజుల సమయం ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే మోనాలిసాకు నటనలో శిక్షణ సైతం ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మోనాలిసాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. మోనాలిసా తన మొదటి సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది .. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకు గాను ఈమె 20 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట .. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. ఈమె తన మొదటి సినిమాకి గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకోబోతుందని మాత్రం వార్తలు వైరల్ అవుతున్నాయి .