సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు వచ్చిన ప్రతి సినిమాను చేస్తూ వెళుతూ ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రం సినిమా కథ నచ్చి అందులో తమ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను ఓకే చేస్తూ ఉంటారు. ఇక సినిమా కథ నచ్చకపోయినా , అందులో తమ పాత్ర నచ్చకపోయినా కొంత మంది ఎంత పారితోషకం ఇచ్చిన కూడా సినిమాలో నటించడానికి ఒప్పుకోరు. ఇకపోతే ఓ మలయాళ ముద్దు గుమ్మ కూడా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా గ్లామర్ పాత్రలలో అస్సలు నటించను అని చెప్పేసింది. ఆ నటి ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణుల్లో సంవృత సునీల్ ఒకరు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో మలయాళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 1998 వ సంవత్సరంలో లో వచ్చిన అయాల్ కథ ఎతువుక్కు సినిమాతో ఈమె వెండి తెరకు పరిచయం అయ్యింది. 2004 వ సంవత్సరంలో వచ్చిన రసికన్ అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టింది.

ఈ సినిమాతో ఈమె మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ బ్యూటీ కోటి రూపాయల పారితోషకం ఇచ్చినా కూడా గ్లామర్ పాత్రలలో అసలు నటించను. డబ్బు మరియు కీర్తి కంటే కూడా శాంతి , ఆనందం లకు నేను ప్రాథమిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాను అని ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: