ఎప్పుడు ఎక్కడ కనిపించినా మొహం మీద చిరునవ్వు తో ఉంటారు .. తన పై ఎలాంటి ఎన్ని విమర్శలు వచ్చినా తిరిగి వాటి గురించి స్పందించరు .. రాజకీయాల్లో ఉన్న సమయం లో ఎదుర్కొన్న విమర్శలు , అవమానాలు ఎన్నో .. ఇక రోజు కనిపించే వినిపించే వార్తలు , పుకార్లకు లోటు లేదు . ఇన్ని జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు ? అయినా ఈ శాంత స్వభావాని కి అసలు కారణం ఏంటి ? చిరంజీవి కి ఎందుకు వెంటనే అసలు కోపం రాదు ? దీనికి ఆయనే ఆన్సర్ ఇచ్చారు .. 


తన ప్రశాంతత వెనుక ఉన్న సీక్రెట్ ను కూడా బయటపెట్టారు . ముఖ్యం గా తనను ఎంత మంది ఎన్ని మాటలు అన్నప్పటి కీ ఎన్ని విమర్శలు చేసినప్పటి కీ చిరంజీవి వాటిని పట్టించుకోరాట .  అలాగే ఆ ట్రోలింగ్ ను  తన మనసు లోకి  అసలు రానివ్వరట .. వారికి కాలమే సమాధానం చెబుతుంద ని గట్టిగా నమ్ముతారట .. అందుకే తాను ఇంత ప్రశాంతం గా ఉండగలుగు తానని చిరు అంటూ ఉంటారు .

మనం చేసే పనిలో ధర్మం గా , మంచిగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన పనిలేదని .. మన చేసే మంచి , ధర్మమే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంద ని చిరంజీవి అంటున్నారు .. అందుకే తాను ఇదే మాట చెబుతూ ఉంటానని ధర్మాన్ని పాటిస్తూ పాజిటివ్ గా ఉంటే అందరూ తనలా ప్రశాంతం గా ఉండొచ్చు అని చిరంజీవి అంటున్నారు . ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో మెగా రక్తదాత లను ఆయన సన్మానించారు వారి తో కాసేపు సరదాగా మాట్లాడుతూ .. ఆ క్రమం లోనే తన ప్రశాంతత వెనుకున్న సీక్రెట్ ను బయటపెట్టారు .

మరింత సమాచారం తెలుసుకోండి: