ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 50 రోజులు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 50 రోజులు పూర్తి అయిన తర్వాత ఈ మూవీ బృందం వారు నిన్న రాత్రి ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇలా ఈ మూవీ విడుదల అయిన చాలా రోజులకు ఈ మూవీ బృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇకపోతే తాజాగా విక్టరీ వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు.

బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి 25 రోజులు కంప్లీట్ అయిన ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 మూవీ మాదిరి గానే సంక్రాంతికి వస్తున్నాం మూవీ యూనిట్ కూడా ఈ సిన విడుదల అయిన తర్వాత చాలా రోజులకు సక్సెస్ మీట్ ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఈ మూవీ బృందం విజయోత్సవ సభను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: