తెలుగు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన హీరోయిన్గా భారీ గుర్తింపు తెచ్చుకుంది కాజల్ .. ప్రజెంట్ సినిమాలు తక్కువగా చేస్తుంది .. టాలీవుడ్ లో వరుస‌ అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు త‌ల్లియింది .. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టుకుని పనిలో పడింది .. అయితే మొదట్లో ఉన్నంత గుర్తింపు సెకండ్ ఇన్నింగ్స్ లో రాలేదని చెప్పాలి .. ప్రజెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గెస్ట్ రోల్లో కూడా నటిస్తుంది .. అయితే కాజల్ గురించి తాజాగా ఓ వార్త‌ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది .. ఒక సినిమాలు లేకపోయినా కాజల్ కోట్లు సంపాదిస్తారని  వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. అసలు కాజల్ కోట్లు ఎలా సంపాదిస్తుందో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం.
 

ఇక కాజల్ టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది .. ఆ తర్వాత చందమామ సినిమాలో నటించింది.. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కలిసి జంటగా నటించింది .. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది .. అయితే కాజల్ కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే తాను ప్రేమించిన గౌతమ్ కిచ్లు లును ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకసారిగా షాక్ ఇచ్చింది .. అంతేకాకుండా సంవత్సరం తిరిగేలోపే ఒక బిడ్డకు త‌ల్లియింది .. ఇలా ఒక వైపు తన కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నం చేసింది .. తాజాగా కాజల్ గురించి ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది.

 

అసలు విషయం ఏమిటంటే కాజల్ చేతుల్లో ప్రస్తుతం సినిమాలు అంతగా లేవు కానీ కోట్లు మాత్రం సంపాదిస్తుంది .. అదెలా సాధ్యమని చాలామందికి డౌట్ రావచ్చు.. అయితే కాజల్ పలు బ్రాండ్ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతుంది .. ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాటిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది .. ఇక ఈమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రముఖ ప్రెగ్నెంట్ కంపెనీకి కూడా ప్రమోటర్గా పనిచేసింది .. అలాగే ప్రెగ్నెంట్ తర్వాత అమ్మాయిలు బాడీలో ఎన్నో రకాలు మార్పులు వస్తాయి ముఖ్యంగా శరీరం తొందరగా డ్రై అవుతుందని .. అలా తొందరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రోడక్ట్ తప్పకుండా వాడాలని చెబుతున్నారు .. ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ వాడటం గురించి చెబుతూ కోట్లు సంపాదిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది .. అలాగే ఇక సినిమాల విషయానికి వస్తే  సత్యభామ అనే లేడీ ఒరియేంటెడ్ మూవీలో నటించింది ఈ మూవీ భారీ విజ‌యం అందుకుంది .. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్పలో కూడా పార్వతి దేవి పాత్రలో నటిస్తుంది .. ఇలా చేతినిండా సినిమాల లేకపోయినా బ్రాండ్ ప్రమోషన్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కాజల్ కోట్లు కూడబెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: