- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప‌ పార్ట్ 2. ఈ సినిమా దేశవ్యాప్తంగానే కని విని ఎరుగని రికార్డులతో సెన్సేషనల్ విజయం సాధించింది. బాహుబలి 2 రికార్డులు సైతం బ్రేక్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా రికార్డు సాధించి దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా నిర్మాతలు పుష్ప సీరిస్ ను మూడు భాగాలతో ఎండ్‌ చేస్తామని ఇదివరకే చెప్పారు. ఇలా వచ్చిన పార్ట్ టు ఎండింగ్లో పార్ట్ 3 పుష్ప 2 గా ఉంటుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ గా పుష్ప పార్ట్ 3 ఫై కం స్టార్ అల్లు అర్జున్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.


పుష్ప పార్ట్ 3 గురించి బ‌న్నీ మాట్లాడుతూ ..ఆ సినిమా గురించి నాకేం తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తనకు మాత్రమే కాదు .. దర్శకుడు సుకుమార్ కూడా ఇంకా ఏం తెలియదు అంటూ బన్నీ చేసిన కామెంట్లు వెటకారంగా ఉన్నాయన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అంటే పుష్ప 3 సినిమా ఉంటుందని ప్రకటించినా . . అది ఎప్పుడు ఉంటుందో బన్నీకి .. సుకుమార్ కు కూడా తెలియదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 3 అనౌన్స్‌ చేసిన ఇంకా దాని స్క్రిప్ట్ లాంటివి ఏమి అనుకోలేదా ? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా రావటానికి మరో మూడేళ్లకు పైనే పడుతుంది అని తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కామెంట్లు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: