- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .  .


ఎందుకో.. అల్లు అర‌వింద్ ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ ని ఏదోలా టార్గెట్ చేస్తున్న‌ట్టు గా క‌నిపిస్తోంది.  మొన్న‌టికి మొన్న ‘ తండేల్ ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజుని ఎలివేట్ చేసే కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజ‌ర్ ప్లాప్ అంటూ ప‌రోక్షంగా చేసిన కామెంట్లు మెగా అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. అదే పెద్ద ర‌చ్చ అయ్యింది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తొలి సినిమా చిరుత స‌రిగా ఆడ‌లేదంటూ .. అది బిలో యావ‌రేజ్ మూవీ అంటూ చేసిన కామెంట్లు కూడా మెగా అభిమానుల్లో తీవ్ర కోపానికి కార‌ణంగా కనిపిస్తున్నాయి.


అల్లు అర‌వింద్ కావాల‌నే రామ్ చ‌ర‌ణ్ ను టార్గెట్ చేసేలా కామెంట్లు చేస్తుండ‌డంతో పాటు మెగా అభిమానుల ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు మెగా అభిమానుల నుంచి తీవ్రంగా వ‌స్తున్నాయి. చర‌ణ్ తొలి సినిమా చిరుత స‌రిగా ఆడ‌లేద‌ని. ఆ టైంలో తాను మ‌గ‌ధీర తీసి సూప‌ర్ హిట్ ఇచ్చాన‌న్న అర్థంలో అర‌వింద్ ఓ ఇంట‌ర్వ్యూ లో చెప్పారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.


అయితే వాస్త‌వానికి చిరుత బిలో యావ‌రేజ్ సినిమా ఎంత మాత్రం కానే కాదు.. అది హిట్ సినిమా. ఆ సినిమా నిర్మాత అశ్వనీద‌త్ .. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. ఆ సినిమా ఆ రోజుల్లోనే  నిర్మాత‌కు మంచి లాభాలు మిగిల్చింది. రూ.9 కోట్ల‌తో తీసిన సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర రూ.25 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. 43 సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడింది. ఓ డెబ్యూ హీరో సినిమా ఆ స్థాయిలో ఆడ‌డం గొప్ప విష‌యం. ఇంకా చెప్పాలంటే బ‌న్నీ తొలి సినిమా గంగోత్రి కంటే చిరుత పెద్ద హిట్‌. మ‌రి అల్లు అర్జున్ ఇవ‌న్నీ తెలియ‌కుండానే ఇలా కామెంట్లు చేస్తార‌ని అనుకోలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: